Saturday, January 18, 2025
Homeసినిమానెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'గుంటూరు కారం'

నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి ‘గుంటూరు కారం’

త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’ సినిమా, జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంలో వచ్చిన ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అందువలన ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టింది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా వాళ్లు అధికారిక ప్రకటన చేశారు.

చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ – మహేశ్ బాబు కలిసి చేసిన సినిమా ఇది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మహేశ్ బాబు జోడీగా శ్రీలీల అందాల సందడి చేసింది. హీరో తన చిన్నతనంలో కొన్ని కారణాల వలన తనని వదిలి వెళ్లిపోయిన తల్లిని, తాను పెద్దయిన తరువాత దగ్గరుండి ఇంటికి తీసుకుని రావడమే కథ.  అందుకు అడ్డుపడిన పరిస్థితులను అతను దాటుకుంటూ రావడమే ప్రధానమైన అంశం.

కథా పరంగా ఈ సినిమాకి కొన్ని విమర్శలు ఎదురైనా, మహేశ్ బాబు లుక్ ను .. పాత్రను అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. తమన్ బీట్స్ కూడా చాలా వరకూ హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా ‘కుర్చీ మడతబెట్టి’ అనే సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. ఇక శ్రీలీల గ్లామర్ .. డాన్సులు మరికొన్ని మార్కులను తెచ్చిపెట్టింది. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్