Saturday, January 18, 2025
Homeసినిమాప్రారంభానికి ముందే రిలీజ్ డేట్ ఫిక్స్?

ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్ ఫిక్స్?

Release date before launch: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాల రూపొందాయి. ఈ రెండు చిత్రాలు అటు మ‌హేష్‌, ఇటు త్రివిక్ర‌మ్ ఇద్ద‌రికీ మంచి పేరు తీసుకువ‌చ్చాయి. అయితే.. ఈ సినిమాలు వెండితెర మీద క‌న్నా బుల్లితెర పై బాగా స‌క్సెస్ అయ్యాయి అని చెప్ప‌చ్చు. ఇప్ప‌టికీ ఈ సినిమాల‌కు టీవీల్లో మంచి రేటింగ్ వ‌స్తుండ‌డం విశేషం. అందుక‌నే ఈ క్రేజీ కాంబినేష‌న్ కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తుంటే ఇప్ప‌టికి సెట్ అయ్యింది.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ జులై రెండో వారం నంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తుంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే రిలీజ్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే.. ఈ మూవీ సంక్రాంతికి రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్ర‌చారంలోకి రావ‌డం ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ ఎప్పుడంటే.. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుద‌ల అంటూ టాక్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మొదట ఓ సాంగ్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్న ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేక సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ఈ మూవీ సంక్రాంతికి వ‌స్తే.. అభిమానుల‌కు పండ‌గే.

Also Read : ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : మహేష్ బాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్