Saturday, March 14, 2026
Homeసినిమా Mahesh Babu: మహేష్‌ మూవీ టైటిల్ ఇదేనా?

 Mahesh Babu: మహేష్‌ మూవీ టైటిల్ ఇదేనా?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో  ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.  ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  మహేష్‌ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.

ఈ సినిమాను తొలుత యాక్షన్ మూవీ చేయాలని స్టార్ట్ చేశారట. ఆ తర్వాత ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఉగాదికి ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది కానీ.. అనౌన్స్ చేయలేదు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఇంత వరకు టైటిల్ ఏంటి అనేది ఖరారు చేయలేదు. కాకపోతే త్రివిక్రమ్ కు అ సెంటిమెంట్ ఉంది. తన ప్రతి సినిమా టైటిల్ అ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేలా పెడుతుంటారు. ఇప్పుడు ఈ సినిమాకి ‘అమరావతికి అటు ఇటు’ టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది.

ఈ టైటిల్ కు మహేష్‌ బాబు కూడా ఓకే చెప్పారని తెలిసింది. అయితే.. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా..? లేక వేరే టైటిల్ చూస్తారా…? అనేది తెలియాల్సివుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్  దీనికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఉన్నాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాడు. వచ్చే  సంక్రాంతికి ఈ భారీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తున్న మహేష్‌ ఈ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular