గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ క్రైమ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’ వెబ్ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా చర్చ జరిగింది. తాజాగా సైతాన్ సీరీస్ లోని ఒక ఎపిసోడ్ తో పాటుగా షో రీల్ ను మీడియాకు ప్రదర్శించడం జరిగింది. వీక్షించిన మీడియా వారితో పలువురు సీరీస్ కంటెంట్ ను అలాగే టేకింగ్ ను మెచ్చుకోవడం విశేషం.
సమాజంలో జరిగే కొన్ని సంఘటన ఆధారంగా ఈ సీరీస్ లో కథ, పాత్రలను రూపొందించడం జరిగింది. ఆర్టిస్టులు రిషి, సెల్లి, జాఫర్, దేవయాని అలాగే ఇతర నటీనటులు అందరూ బాగా చేశారని దర్శకుడు మహి వి రాఘవ్ తెలిపారు. ఒక తెలుగు వెబ్ సిరీస్ లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం తొలిసారి. వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఆ సీన్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోమని తెలిపారు. ఒక దర్శకుడిగా అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలి అనేదే నా కోరిక అన్నారు.