Village Secretariats:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులుగా పనిచేస్తున్న వారికి జూనియర్ అసిస్టెంట్ లుగా కొత్త బాధ్యతలు అప్పగిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిబ్బంది యొక్క ప్రొబేషన్ కాలం కూడా పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి నుండి సచివాలయం సిబ్బందికి పే స్కేల్ రూపం లో జీతాలు ఇవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా ప్రతి సచివాలయానికి ఓ జూనియర్ అసిస్టెంట్ అవసరం అవుతారు. ఈ బాధ్యతని సచివాలయం మహిళా పోలీస్ కి అప్పగించనున్నారు.
మరో వైపు సచివాలయాల్లో మహిళా సిబ్బందికి పోలీసు బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 59ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పోలీసు విధులు సచివాలయ సిబ్బందికి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈ జీవో వెనక్కు తీసుకుంటున్నామని, అఫిడవిట్ రూపంలో త్వరలోనే పూర్తీ వివరాలు కోర్టుకు అందిస్తామని పేర్కొంది.
Also Read : ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించడం ఖాయం