Thursday, March 12, 2026
HomeTrending NewsTomato Farmer: టమాటా సాగుతో కోట్ల లాభాలు... సిఎం అభినందన

Tomato Farmer: టమాటా సాగుతో కోట్ల లాభాలు… సిఎం అభినందన

మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి తో వచ్చిన రైతు మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటా పంటను అమ్మామని, మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్ రెడ్డి సీఎంకు వివరించారు.

వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఉన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular