Wednesday, March 11, 2026
Homeసినిమాదసరాకు బాలయ్యతో రవితేజ పోటీ

దసరాకు బాలయ్యతో రవితేజ పోటీ

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో వరుసగా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో భగవంత్ కేసరి పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అనిల్ రావిపూడి కూడా వరుస విజయాలతో జోరు మీదున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ బాలయ్య అభిమానులకు విపరీతంగా నచ్చేసింది.

ఇదిలా ఉంటే.. రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్. అయితే.. అక్టోబర్ 19న బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ ఉంది కాబట్టి రవితేజ సినిమా వాయిదాపడడం ఖాయమని ప్రచారం జరిగింది. షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉందని.. ఇప్పట్లో ఈ సినిమా రాదని టాక్ వినిపించింది. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎవరో కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని,ఇంతకుముందు ప్రకటించినట్టుగానే టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న వస్తుందని రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు.

దీంతో దసరాకి బాలయ్య-రవితేజ మధ్య పోటీ ఖాయమని క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సినిమా లియో  కూడా వస్తున్నప్పటికీ ప్రధానంగా బాలయ్య, రవితేజ సినిమాల మధ్యే పోటీ ఉంటుంది. మరి.. ఈ దసరా పోటీలో ఎవరు విజయం సాధిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular