Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచిన నాగ్

ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచిన నాగ్

నాగార్జున న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ది ఘోస్ట్‘.  ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన పోస్ట‌ర్, టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ది ఘోస్ట్ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల నాగార్జున పై చిత్రీకరించిన తమహాగనే అనే ఒక అద్బుతమైన వీడియోను విడుదల చేశారు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇంకా చెప్పాలంటే.. సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ మూవీకి సంబంధించి ప్రత్యేక గ్లింప్స్ ఓఎస్టి (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) విడుదల చేశారు.

ఓఎస్టి అయితే.. అదిరింది. మ్యూజిక్ చాలా పవర్ ఫుల్ గా.. అద్బుతంగా ఉంది. అందుకే అభిమానులు ఖచ్చితంగా ది ఘోస్ట్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అంటున్నారు. ఇందులో నాగార్జున స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టించింది.  శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ది ఘోస్ట్ మూవీని నిర్మించాయి. మ‌రి.. ది ఘోస్ట్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read : ‘ది ఘోస్ట్’కి హాలీవుడ్ మూవీకి లింకేమిటి? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్