Heavy budget: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తుంటే.. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మైథలాజికల్ మూవీ పై ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే… ఈ మూవీకి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీన్ కోసం ఊహించని మొత్తాన్ని మేకర్స్ ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ లలో ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ చిత్రంలోని కీలకమైన ఓ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఈ సంవత్సరం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : వచ్చే ఏడాది ఆగస్టులో ‘ఆది పురుష్’