Monday, February 24, 2025
HomeUncategorized'నేను స్టూడెంట్ సర్!' ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసిన గోపీచంద్ మలినేని

‘నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసిన గోపీచంద్ మలినేని

‘స్వాతిముత్యం’ చిత్రంతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ”నేను స్టూడెంట్ సార్!’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ”నేను స్టూడెంట్ సర్!’ టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు, మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు.

క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్‌ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు.కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్‌ కి అవంతిక దస్సాని పై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెర పై కూల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథను కృష్ణ చైతన్య అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read :   నేను స్టూడెంట్ సార్!’ లో సముద్రఖని

RELATED ARTICLES

Most Popular

న్యూస్