Sunday, September 8, 2024
Homeసినిమా‘ఆకాశ వీధుల్లో’ ట్రైలర్ బాగుంది : గోపీచంద్ మలినేని

‘ఆకాశ వీధుల్లో’ ట్రైలర్ బాగుంది : గోపీచంద్ మలినేని

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని హాజరై ట్రైలర్ ని విడుదల చేశారు.

అనంతరం దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..  ఒక రోజు వీళ్ళు నాకు ఫోన్ చేసి ట్రైలర్ చూడమని చెప్పారు. నచ్చితేనే సపోర్ట్ చేయండి అన్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే అతనిలో ఎంత తపన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసి ఈ టీమ్ ను అబినందించాలనే ఈ వేడుకకు వచ్చాను. ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.

హీరో, దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “సాధారణంగా హీరో, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ఎదో డబ్బులున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరు అంటారు. కానీ అది కాదు .. ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం .. ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. ఎవరి హెల్ప్ తీసుకోలేదు. సినిమా అంటే నాకు ప్యాషన్, అందుకే నేనే దగ్గరుండి చేస్తున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్