Sunday, January 19, 2025
Homeసినిమాబింబిసార డైరెక్టర్ మూవీ చిరుతోనా..? బాలయ్యతోనా.?

బింబిసార డైరెక్టర్ మూవీ చిరుతోనా..? బాలయ్యతోనా.?

కళ్యాణ్ రామ్ నటించిన మూవీ బింబిసార. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తొలి సినిమాకే సోషియో ఫాంటసీ స్టోరీ ఎంచుకోవడం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో మల్లిడి వశిష్ట్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రజినీకాంత్ తో మల్లిడి వశిష్ట్ సినిమా అంటూ ప్రచారం జరిగింది. బింబిసార సినిమా నచ్చడంతో రజినీకాంత్ కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారట. వశిష్ట్ కథ చెప్పడం జరిగిందట కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు.

ఇప్పుడు చిరంజీవితో వశిష్ట్ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు చరణ్ కోసం కథ రెడీ చేశాడట. చిరంజీవికి కథ చెప్పడానికి వెళితే.. చరణ్ కోసం కాదు.. తనకు సరిపోయే కథ ఉంటే చెప్పు అన్నారట. అప్పుడు చిరంజీవి కోసం అనుకున్న సోసియో ఫాంటసీ స్టోరీ చెప్పాడట. ఈ కథ చిరుకు బాగా నచ్చడంతో వెంటనే ఫుల్ స్టోరీ రెడీ చేయమన్నారట. ప్రస్తుతం వశిష్ట్ ఫుల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే.. మల్లిడి వశిష్ట్ బాలయ్యతో సినిమా చేయడం కోసం అడ్వాన్స్  కూడా తీసుకున్నారట.

బాలయ్య, వశిష్ట్ కాంబోలో టాప్ ప్రొడక్షన్ హౌస్ ఓ సినిమా నిర్మించాలి అనుకుంటుందట. స్టోరీ లైన్ నచ్చడంతో వశిష్ట్ కు అడ్వాన్స్ కూడా భారీగా ఇచ్చిందట. ఈ వార్త బయటకు వచ్చింది. ఇలా చిరు, బాలయ్యలతో సినిమా చేసే ఛాన్స్ రావడం వలనే బింబిసార 2 కు కథ మాత్రం ఇచ్చి డైరెక్షన్ బాధ్యతలను వేరే డైరెక్టర్ కు అప్పగించాడట. ఇప్పుడు చిరు మూవీ కోసం కథను రెడీ చేస్తున్నారు. అలాగే బాలయ్యతో చేయనున్న మూవీకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట. దీంతో వశిష్ట్ నెక్ట్స్ మూవీ చిరుతోనా..? బాలయ్యతోనా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ముందుగా చిరుతో సినిమా చేసి ఆతర్వాత బాలయ్యతో సినిమా చేస్తాడని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్