Sunday, January 19, 2025
Homeసినిమా'ఏజెంట్' లో ఆకట్టుకుంటున్న మమ్ముట్టి లుక్

‘ఏజెంట్’ లో ఆకట్టుకుంటున్న మమ్ముట్టి లుక్

The Devil: హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి మొదటిసారిగా క‌లిసి చేస్తున్న‌యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఖిల్ ని మునుపెన్నడూ చూడని డాషింగ్ లుక్ లో ప్రెజెంట్ చేశారు. యాక్షన్ – ప్యాక్డ్ రోల్ లో సరికొత్త గా కనిపిస్తాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయికగా కొత్త నటి సాక్షి వైద్య ఎంపికైంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఇందులో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నారు.


ఏజెంట్ తాజా షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమయింది. ఇందులో మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మమ్ముట్టి పోస్టర్ను విడుదల చేసింది. `ద డెవిల్ రూత్ లెస్ సేవియర్` అంటూ ఇంట్రెస్టింగ్ కాప్షన్ పెట్టారు. అందుకు తగినట్లుగా క్రూరమైన రక్షకుడిగా ఆ లుక్ లో మమ్ముట్టి కనిపించాడు. లుక్స్ పర్ ఫెక్ట్ గా వున్నాయి. పోస్టర్ ఆయన కేరెక్టర్ కు హైప్ పెంచేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్