Sunday, February 23, 2025
Homeసినిమాభీమవరంలో ‘మంచి రోజులు వచ్చాయి’ స్పెషల్ ప్రీమియర్స్

భీమవరంలో ‘మంచి రోజులు వచ్చాయి’ స్పెషల్ ప్రీమియర్స్

Manchi Rojulochaie Special Premier Show In Bhimavaram Also :

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా, దర్శకుడు మారుతి రూపొందించిన కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా ఉన్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు.

ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా పేయిడ్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటితో పాటు హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. రెస్పాన్స్ చాలా బాగా ఉండటంతో సినిమాకు మరింత కలిసి రానుంది. సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Must Read :మారుతి సినిమాలో అది గ్యారెంటీ: హీరో గోపీచంద్

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్