Friday, November 22, 2024
HomeTrending NewsChilkur Forest Block: మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభం

Chilkur Forest Block: మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభం

ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో 256 ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి, కోటి వృక్షార్చన లో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మొక్కలు నాటారు.

అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువ‌నుంది. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించారు.

పార్క్ ప్రత్యేకతలు

విస్తీర్ణం: 256 ఎకరాలు
వ్యయం: రూ. 7.38 కొట్లు
పొడవు: 5.6 కి. మీ.
మొక్కలు: 50 వేల రకాలు
ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.
వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.

109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 74 వ పార్కును ఇవాళ ప్రారంభించుకున్నాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్