Sunday, March 15, 2026
Homeసినిమామంచు మ‌నోజ్ కి క‌రోనా

మంచు మ‌నోజ్ కి క‌రోనా

Manoj Covid Positive: కరోనా.. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ‌ర‌నీ వ‌ద‌ల‌డం లేదు. కొత్త‌గా ఓమిక్రాన్ అంటూ టెన్ష‌న్ పెడుతుంది. ఓమిక్రాన్  కేసులు పెరుగుతుండ‌డం.. సినీ ప్ర‌ముఖులు కరోనా బారిన పడుతుండ‌డం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యంగ్ హీరో, మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేశారు.

ఈ సంద‌ర్భంగా మ‌నోజ్ స్పందిస్తూ… “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం రోజులుగా కలిసిన వారందరూ.. దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఎవ‌రూ ఆందోళన చెందవద్దు. నేను క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్ లకు ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular