Saturday, March 14, 2026
Homeసినిమామంచు విష్ణుకు గాయాలు. అసలు ఏమైంది..?

మంచు విష్ణుకు గాయాలు. అసలు ఏమైంది..?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ లో విష్ణుకు గాయాలు అయ్యాయట. దీంతో ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆపేశారని తెలిసింది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగిందట. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయని సమాచారాం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని తెలిసింది.

ఈ సినిమాకి రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్  కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇందులో ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు ఉన్నారని తెలుస్తోంది. బుల్లితెర పై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందించారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈమధ్య విష్ణు కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. భక్తకన్నప్ప విష్ణు కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular