Tuesday, March 17, 2026
HomeసినిమాManchu: హౌస్ ఆఫ్ మంచూస్ వీడియో రిలీజ్ చేసిన విష్ణు

Manchu: హౌస్ ఆఫ్ మంచూస్ వీడియో రిలీజ్ చేసిన విష్ణు

మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్.. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగా ఇటీవల విష్ణు దాడి చేస్తున్నాడని మనోజ్ వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.  మంచు లక్ష్మీప్రసన్న ఈ వివాదంపై స్పందించలేదు. వారి తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగి కొడుకులిద్దరినీ మందలించడం.. మనోజ్ ఆ వీడియోను డిలేట్ చేయడం జరిగింది. అక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది.

ఇదిలా ఉంటే.. మంచు బ్రదర్స్ గొడవ ఎపిసోడ్ ని క్యాష్ చేసుకునేందుకు ఒక రియాలిటీ షోని విష్ణు ప్లాన్ చేయడం చర్చనీయాంశమైంది. హౌస్ ఆఫ్ మంచూస్  పేరుతో భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోను చేయాలనుకుంటున్నారు. దీనిపై ఒక ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. మంచు బ్రదర్స్ ఘర్షణ గురించిన వార్తా ఛానెళ్ల క్లిప్పింగ్ లతో ఇది ఆసక్తిని కలిగించింది. టీజర్ లో విష్ణు మంచు తనని తాను పరిచయం చేసుకోవడం.. అనంతరం తమ ఇంట ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.

నిజానికి ఇలాంటి రియాలిటీ షోలు హాలీవుడ్, బాలీవుడ్ లో కొత్తేమీ కాదు. కర్దాషియన్ల సిస్టర్స్ వ్యక్తిగత జీవితాన్ని తెలియచేసేలా రూపొందించిన అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్ అయిన ది కర్దాషియన్స్ మాదిరిగా ఇటీవలే బాలీవుడ్ లో శర్మా సిస్టర్స్ చిరుత ఫేం నేహా శర్మ- ఐషా శర్మ షో పాపులరైంది. ఇప్పుడు మంచు విష్ణు రంగంలోకి దిగాడు. మంచు ఫ్యామిలీ లో ఘర్షణలతో పాటు వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ కథను తెర పై చూపించే ప్రయత్నమిది. ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై విష్ణు స్వయంగా ఈ రియాల్టీ షోను నిర్మించనున్నారు. మరి.. ఈ రియాల్టీ షోలో ఏం చూపించనున్నారో..? అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular