Saturday, January 18, 2025
Homeసినిమా‘మా' బరిలో మంచు విష్ణు

‘మా’ బరిలో మంచు విష్ణు

తెలుగు చిత్రపరిశ్రమలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఈసారి ‘మా’ అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు. తండ్రి డా.మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా సంప్రదించారు. వారు కూడా విష్ణును అశీర్వదించినట్లు తెలుస్తోంది. ‘మా’ సభ్యుల సంక్షేమం, ‘సొంత భవనం ఏర్పాటుకు కృషి….ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్