Wednesday, March 11, 2026
Homeసినిమా'కన్నప్ప'పై పెరుగుతున్న అంచనాలు!

‘కన్నప్ప’పై పెరుగుతున్న అంచనాలు!

ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకునే సినిమాల జాబితాలో ‘కన్నప్ప’ ఒకటిగా కనిపిస్తోంది. మంచు విష్ణు హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ‘తిన్నడు’ అనే ఓ గిరిజన భక్తుడి కథ ఇది. పరమశివుడికి తన కళ్లను అప్పగించడానికి సిద్ధపడి .. ఆయన పరీక్షలో నెగ్గి .. కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ కంటెంట్ తో ఇంతకుముందు కృష్ణంరాజు చేసిన ‘భక్త కన్నప్ప’ సంచలన విజయాన్ని సాధించింది. హీరోగా ఆయనను .. ఆయన బ్యానర్ ను కూడా ఈ సినిమా నిలబెట్టింది.

అదే కంటెంట్ తో మళ్లీ ఇంతకాలానికి మంచు విష్ణు ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కథ అంతా కూడా అడవీ ప్రాంతంలోనే జరుగుతుంది. అందువలన న్యూజిలాండ్ లోని అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగును జరుపుతున్నారు. ఈ కథకి అద్భుతమైన వీ ఎఫ్ ఎక్స్ ను జోడించి విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ‘కన్నప్ప’ను ఓ గూడెం దొర పెంచుతాడు. ఆ దొర పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తారని అంటున్నారు. ఇక పార్వతీ పరమేశ్వరులుగా ప్రభాస్ – నయనతార కనిపించనున్నారని చెబుతున్నారు.

కథా పరంగా .. ఈ సినిమా కోసం కేటాయించిన బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి ఉంది .. అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దైవం నేపథ్యంలోని కథలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ‘కార్తికేయ 2’ .. ‘హను మాన్’ సినిమాల విజయాలను అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే మహాశివుడి నేపథ్యంలో సాగే ‘కన్నప్ప’ కూడా సంచలన విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular