Saturday, January 18, 2025
HomeTrending Newsరాంకీలో నాకు షేర్లు లేవు: ఆర్కే

రాంకీలో నాకు షేర్లు లేవు: ఆర్కే

తన రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని, 2006 నుండి 2021 వరకు రాంకీ గ్రూప్ లో ఏ విధమైన షేర్లు తనకు లేవని వెల్లడించారు. ఇదే విషయం రాంకీ గ్రూప్ పై జరిగిన ఐటీ దాడుల్లో రుజువు అయ్యిందని తెలియజేశారు. కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో ముందు టీడీపీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు. ముందు అవగాహన చేసుకుని ఆ తర్వాత మాట్లాడాలన్నారు.

రామకృష్ణారెడ్డి మంగళగిరి ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అయన మాట్లాడిన ముఖ్యాంశాలు…

నామీద అవినీతి, అక్రమాలు వెలువడ్డాయి అనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను.

  • దుగ్గిరాల మండలం లో ఇళ్ల స్థలాలు విషయం లో అవినీతి జరిగింది అన్న మాట అవాస్తవం. టీడీపీ నాయకులు దీన్ని బూచిగా చూపడం కరెక్ట్ కాదు.
  • లోకేష్ పై నేను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచాను నాకు స్థానిక ప్రజలు అంతటి విజయాన్ని చేకూర్చారు. స్థానిక టీడీపీ నాయకులు ఇది తెలుసుకోవాలి.
  • మేము ఎక్కడా కావాలని పేదల ఇళ్ళు కూల్చలేదు.
    వారి గృహాలలో వారికి పనికి వచ్చే వస్తువులు తీసుకెళ్లాక మొండి గోడలను మాత్రమే మేము జేసీబీ లతో కూల్చడం జరిగింది.
    ఇది గ్రహించలేని స్థానిక టీడీపీ నాయకులు నానా గందరగోళం సృష్టించారు.
  • కోటి జన్మలెత్తినా టీడీపీకి మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధ్య పడదు
  • పుష్కరాల పేరుతో తాడేపల్లి లో 2000 నివాసాలను టీడీపీ ప్రభుత్వం తొలగించింది. వారికి ఎటువంటి న్యాయం చేయలేదు
RELATED ARTICLES

Most Popular

న్యూస్