Saturday, January 18, 2025
Homeసినిమా‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుండి ‘మాంగ‌ళ్యం’ పాట విడుద‌ల‌

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుండి ‘మాంగ‌ళ్యం’ పాట విడుద‌ల‌

Mangalyam Song  : యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈచిత్రం విడుద‌ల కానుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి తోడ్పడుతోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఈరోజు దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచిన నాల్గవ పాట మాంగళ్యం తంతునానేనా విడుదలైంది. ఏస్ కంపోజర్ ఈ చిత్రానికి భిన్నమైన, అద్భుతమైన ట్రాక్‌లను ట్యూన్ చేశారు. ఈ పాట‌ థీమ్, కంపోజ్ చేసిన విధానం, విశేషమైన గానం, ఫన్నీ లిరిక్స్ అన్నిక‌లిపి ఈ పాట‌ను మ్యూజిక్ చార్ట్‌ ల్లో అగ్రస్థానంలో నిల‌బెట్టాయి.

మాంగళ్యం తంతునానేనా’ అనే శ్లోకాన్ని ఆధునీకరించిన ఈ పాటలో శర్వానంద్ తన చిరాకు చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన ఈ పాట‌కు జస్‌ప్రీత్ జాస్ గాత్రం అందించారు. శర్వా డ్యాన్స్ మూమెంట్స్‌ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్