Sunday, January 19, 2025
Homeసినిమామణిరత్నం కల కష్టం 'పొన్నియిన్ సెల్వన్'

మణిరత్నం కల కష్టం ‘పొన్నియిన్ సెల్వన్’

ఒక కథ కల్పన అయితే దర్శకుడికి ఆ పాత్రలను తన ఇష్టానుసారం మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆ కథకు తనకి నచ్చిన ముగింపును ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చారిత్రక నేపథ్యంలోకి అడుగుపెడితే ఆ కథకి కట్టుబడిపోవాలి .. పట్టుబడిపోవాలి. అంతేకాదు చారిత్రక నేపథ్యానికి తగిన వాతావరణాన్ని తెరపై చూపించడం  .. ఆయా పాత్రల స్వభావానికి తగిన గెటప్పులు సెట్  చేయడం   .. ఆ కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయించడం అనుకున్నంత తేలిక కాదు. ఎక్కడ ఏ విషయంలో క్లారిటీ లేకపోయినా ప్రాజెక్టు దెబ్బ తింటుంది.

అలాంటి ఒక ప్రయోగాన్ని .. సాహసాన్ని ‘పొన్నియిన్ సెల్వన్‘ సినిమాతో మణిరత్నం చేశారు. కల్కి కృష్ణమూర్తి రాసిన ఫేమస్ నవల ఆధారంగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. చోళరాజుల కాలంలో జరిగిన కథ ఇది .. పాండ్య రాజులతో వారు చేసిన యుద్ధాల నేపథ్యంలో నడిచే కథ ఇది. అలాంటి ఈ సినిమాను తాను హీరోగా రూపొందించడానికి అప్పట్లో ఎంజీఆర్ గట్టి ప్రయత్నాలు చేశారని అంటారు. కానీ అప్పటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడం వలన ఆయన వెనక్కి తగ్గారని చెబుతారు.

అలాంటి కథను తన దగ్గర పెట్టుకుని 40 ఏళ్లుగా ఆ కథను గురించి ఆలోచన చేస్తూ మణిరత్నం రంగంలోకి దిగారు.  ఇది ఆయన కల .. కష్టం .. కసరత్తు ఇలా ఎన్నైయినా చెప్పుకోవచ్చు. స్టార్స్ అంతా  ఆయనకి అనుకూలమైన డేట్స్ సర్దుబాటు చేయడం  .. వందల కోట్లు ఖర్చు చేయడానికి లైకావారు ముందుకు రావడం  .. ఇదంతా మణిరత్నం పై ఉన్న  నమ్మకంపై జరిగింది. ఏఆర్ రెహ్మాన్ తో కలిసి ఈ సినిమాను ఆయన ఈ నెల 30వ తేదీన తెరపైకి తీసుకుని వస్తున్నారు.     ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా, సౌత్ సృష్టించే సంచలనం అవుతుందేమో చూడాలి.

Also Read: పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్