Friday, September 20, 2024
HomeTrending Newsమోడీ బొమ్మ లేకుండానే కూటమి మేనిఫెస్టో

మోడీ బొమ్మ లేకుండానే కూటమి మేనిఫెస్టో

ఏపీలో కూటమిగా పోటీ చేస్తోన్న బిజెపి-తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టో విడుదలతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మోడీ బొమ్మ లేకుండా, బిజెపి హామీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టోగానే దీన్ని విడుదల చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఈ కూటమిలో బిజెపి అయిష్టంగా చేరిందనే అనుమానాలకు ఇది తావిస్తోంది.

తొలుత మధ్యాహం 12 గంటలకే  మీడియా సమావేశం అని ప్రకటించి చివరకు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. బిజెపి పరిశీలకుడిగా రాష్ట్రంలో ఉన్న సిద్దార్థ్ నాథ్ సింగ్ మాత్రమే పాల్గొన్నారు.

మేనిఫెస్టోలోని అంశాలను ముందుగా బిజెపి కేంద్ర నాయకత్వానికి పంపలేదని, చివరి క్షణాల్లో దీనిపై సమాచారం ఇచ్చారని అందుకే ఢిల్లీ పెద్దలు దీనితో తమకు సంబంధం లేదని….. మోడీ ఫొటో తీసేసి విడుదల చేసుకోవాలని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అప్పటికప్పుడు  కొత్త కాపీలు ముద్రించి కార్యక్రమాన్ని మమ అనిపించారని సమాచారం.  తొలుత కేంద్ర హోం శాఖామంత్రి  అమిత్ షా, బాబు, పవన్ లు కలిసి మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పినా అది కార్యరూపం దాల్చలేరు. చివరకు కేంద్రం నుంచి ఎవరో ఒక కీలక నేత వస్తారని భావించినా అది కూడా జరగలేదు.

బిజెపి తరఫున లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేసినందున ఏపీలో రెండు పార్టీల మేనిఫెస్టో విడుదల చేశారని… దీన్ని తప్పు బట్టాల్సిన అవసరం లేదని  సిద్దార్థ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. తాను ఈ కార్యక్రమానికి వచ్చానంటేనే కేంద్ర నాయకత్వం అనుమతి ఉన్నట్లని తేల్చి చెప్పారు. దీన్ని పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

కానీ దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మోడీ, అమిత్ షా రాష్ట్రంలో ఉమ్మడి సభల్లో పాల్గొంటారా లేదా అనేది కూడా అనుమానాస్పదమేని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్