Friday, November 22, 2024
Homeసినిమా'మంజుమ్మల్ బాయ్స్' ప్రత్యేకత అదే!

‘మంజుమ్మల్ బాయ్స్’ ప్రత్యేకత అదే!

మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలైన మూడు సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. వసూళ్ల పరంగా ఈ మూడు సినిమాలు పోటీ పడ్డాయి. ఆ మూడు సినిమాలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, తెలుగులో విడుదలయ్యే సమయానికే 250 కోట్ల వరకూ వసూలు చేసింది. తెలుగులోను అదే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కారణంగా ఈ సినిమాలోని ఆర్టిస్టులు ఆడియన్స్ కి ముఖపరిచయమై ఉండొచ్చు.

2006 లో కొడైకెనాల్ లోని ‘గుణ కేవ్స్’ లోని ఒక బిలంలో ఒక యువకుడు పడిపోతాడు. ఆ యువకుడిని బయటికి తీయడానికి రెస్క్యూ టీమ్ కూడా వెనుకాడటంతో, ఒక స్నేహితుడు ఆ గుహలోకి వెళతాడు. కథ అంతా కూడా ఈ గుహ చుట్టూనే తిరుగుతుంది. గుహలో ఒక యువకుడు పడిపోవడం .. ఆ గుహలోకి అతని స్నేహతుడు దిగడం .. పడిపోయిన వ్యక్తిని లోపలి నుంచి బయటికి తీసుకుని రావడం ఈ కథలోని కీలకమైన ఘట్టాలు. ఈ సన్నివేశాలు ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టేస్తాయి. ఊపిరి బిగబట్టేలా చేస్తాయి.

ఆంగ్లేయుల కాలంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకునే ఈ బిలంలోకి జారిపోయిన వారెవరూ బ్రతికి బయటకి రాలేదు. ఈ గుహ లోపల ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. లోపలికి జారిపోయిన వ్యక్తి ఎంతవరకూ వెళ్లే అవకాశం ఉంది? ఒకవేళ అతను ప్రాణాలతో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు? అనేది అత్యంత సహజంగా ఆవిష్కరించడం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. తెలుగులోను ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను రాబడుతూ ఉండటానికి కారణం కూడా ఇదే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్