Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలో దూసుకుపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్' 

ఓటీటీలో దూసుకుపోతున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ 

ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో .. ఆతృతతో ఎక్కువమంది వెయిట్ చేసినది ఏదైనా ఉందంటే, అది మలయాళంలో వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ అనే చెప్పాలి. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత తమిళ .. తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అయితే తెలుగులో ఈ సినిమా కంటెంట్ గురించి తెలిసినవారు మాత్రమే థియేటర్స్ వెళ్లారు.

మలయాళంలో ఏదైతే టైటిల్ పెట్టారో, అదే టైటిల్ తో మిగతా భాషల్లోను ముందుకు వెళ్లారు. అయితే టైటిల్ అంతగా కనెక్ట్ కాకపోవడం వలన, థియేటర్స్ కి ఎక్కువ సంఖ్యలో ఆడియన్స్  వెళ్లలేక పోయారు. అలాంటి ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూస్తున్నారు. నిన్నటి నుంచే ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యథార్థ సంఘటనతో కూడిన కథ కావడం .. మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠభరితంగా నడవడం వలన, ఒక రేంజ్ లో వ్యూస్ ను రాబడుతూ వెళుతోంది.

వయసు నలభైల్లో పడిన కొందరు చిన్ననాటి మిత్రులు, సరదాగా టూర్ ప్లాన్ చేసుకుని కొడైకెనాల్ వెళతారు. అక్కడి ‘గుణ కేవ్స్’ దగ్గరికి ఉత్సాహంతో వెళతారు. అక్కడ ‘డెవిల్స్ కిచెన్’ అని ఆంగ్లేయుల కాలంలో పేరుపడిన ఒక గుహలోకి ఒక మిత్రుడు జారిపోతాడు. అందులో అప్పటి వరకూ పడిన 13 మందిలో ఏ ఒక్కరూ బ్రతికి బయటపడలేదు. అందువలన ఆశ వదులుకోమని మిగతా స్నేహితులకు పోలీస్ అధికారులు చెబుతారు. అప్పుడు ఆ స్నేహితులు ఏం చేశారనేదే కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్