Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీ తెరపైకి పాన్ ఇండియా స్థాయిలో  'మంజుమ్మల్ బాయ్స్'

ఓటీటీ తెరపైకి పాన్ ఇండియా స్థాయిలో  ‘మంజుమ్మల్ బాయ్స్’

మలయాళంలో ఈ మధ్య కాలంలో భారీ లాభాలను సాధించిన సినిమా ఏదంటే, ‘మంజుమ్మల్ బాయ్స్’ అనే పేరు ఠకీమని వినిపిస్తుంది. మలయాళంలో రూపొందిన ఈ సినిమా ఈస్థాయి వసూళ్లను సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాలో కమర్షియల్ హంగులు లేకపోవడం వలన, ఇతర భాషల్లో పెద్దగా ఆడదనే అభిప్రాయాలు కూడా ఆరంభంలో వినిపించాయి. అలాంటి సినిమాను ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలోకి అందుబాటులోకి తెస్తున్నారు.

‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాను 2006లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. 40ల్లో పడిన కొంతమంది స్నేహితులు ‘కొడైకెనాల్’ చూడటానికి కేరళ నుంచి వెళతారు. అక్కడ ‘గుణ కేవ్స్’ ను చూడటానికి అత్యుత్సాహంతో ముందుకు వెళతారు. నిషేదిత ప్రాంతం అనే హెచ్చరికలను పట్టించుకోకుండా గుహ సమీపానికి వెళతారు. అప్పుడు వాళ్లలో ఒకరు ఆ గుహలోకి జారిపోతారు. అప్పుడు ఆ గుహ గురించి వారికి తెలుస్తుంది .. అది సామాన్యమైన గుహ కాదని.

ఆంగ్లేయుల కాలంలోనే ఆ గుహను ‘డెవిల్స్ కిచెన్’ గా పిలిచేవారనీ, గతంలో అందులో పడిపోయిన 13 మందిలో ఏ ఒక్కరి ఆనవాళ్లు కూడా దొరకలేదని. ఆ గుహలోకి దిగడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఒక స్నేహితుడు ధైర్యం చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. ఈ సంఘటనకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు కాబట్టి, పాన్ ఇండియా స్థాయిలో ఓటీటీలో వదులుతున్నారు. త్వరలోనే హాట్ స్టార్ వారు ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్