Friday, March 20, 2026
HomeTrending NewsBRS Maharastra: బిఆర్ఎస్ పార్టీలోకి ఎన్.సి.పి నేతలు

BRS Maharastra: బిఆర్ఎస్ పార్టీలోకి ఎన్.సి.పి నేతలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది. బుధవారం అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారిలో ఎన్ సి పి పార్టీ నుండి..ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్ సి పి పార్టీ వైస్ ప్రెసిడెంట్ రణ్వా సింగ్, విదర్భ షెత్కారి సంఘటన్ అధ్యక్షుడు జంగదీష్ పాండే, మహారాష్ట్ర అన్నదాత శేటకారి సంఘటన్ అధ్యక్షుడు జయజీ రావు సూర్య వంశీ, పోలంబరి ఎన్ సి పి ఉపాధ్యక్షుడు త్రయంబత్ మడ్గే- లు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వీరితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు, సామాజిక సేవ తదితర రంగాలకు చెందిన పలువురు నేతలు సిఎం కేసీఆర్ సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు.

వారిలో…జగదీష్ బోండే, కాశీనాథ్ ఫుటానే, కుల్దీప్ బోండే, స్వప్నిల్ వాకోడే, నందకిషోర్ ఖేర్డే, రుషబ్ వాకోడే,విజయ్ విల్హేకర్, సంజయ్ తైడే, అజయ్ దేశ్‌ముఖ్, అరుణ్ సాకోరే , సునీల్ షెరేవార్ , ప్రమోద్ వాంఖడే , సునీల్ పడోలె, ప్రవీణ్ కోల్హే, జ్ఞానేశ్వర్ గాడే, గజానన్ భగత్, అమోల్ జాదవ్, సంజయ్ భుర్కటే, భీమ్‌రావ్ కొరాడ్కర్, సతీష్ అగర్వాల్, జె డి పాటిల్, గజానన్ దేవకే, సంజయ్ భర్సక్లే , సునీల్ సాబల్,సుశీల్ కచ్వే, మహేంద్ర గవాండే, గులాబ్ చవాన్, ఎన్ డి బ్రహ్మంకర్,ప్రమోద్ వాంఖడే, పురుషోత్తం ధోటే, కుమార్ సోమవంశీ, విజయ్ లాజుర్కర్, అంకుష్ మాకోడే, సాగర్ గవాండే, సుధాకర్ తేటే…తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular