Monday, February 24, 2025
HomeTrending NewsMarimuthu No More: గుండెపోటుతో కన్నుమూసిన తమిళ నటుడు జి మరిముత్తు

Marimuthu No More: గుండెపోటుతో కన్నుమూసిన తమిళ నటుడు జి మరిముత్తు

ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. పలువురు సినీ ప్రముఖుల మరణంతో విషాదం నింపుతున్నారు. తాజాగా తమిళ పరిశ్రమలో తమిళ్ సీనియర్ నటుడు, దర్శకుడు మరిముత్తు నేడు ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. దీంతో తమిళ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు.

ఉదయం 8:30గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు.సీరియల్ కి డబ్బింగ్ చెబుతుండగా గుండెపోటుతో మరిముత్తు కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. కానీ గుండెపోటు కారణంగా హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలోనే మరిముత్తు తుదిశ్వాస విడిచారు.58ఏళ్ల వయసులో మరణించిన మరిముత్తు, తమిళంలో 80కి పైగా సినిమాల్లో నటించారు.

ఇటీవల రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఒకడిగా మరిముత్తు కనిపించారు.మరిముత్తు సడెన్ గా మరణించడం తమిళ సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళ హీరోలు, నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్