Wednesday, April 9, 2025
Homeసినిమామారుతి కాస్తంత కసరత్తు చేయవలసిందే!

మారుతి కాస్తంత కసరత్తు చేయవలసిందే!

Need Hard work: టాలీవుడ్ డైరెక్టర్స్ లో మారుతికి మంచి పేరు ఉంది. ఆయన కథల్లో తెలుగుదనం ఉంటుంది .. తక్కువ బడ్జెట్ లోనే మంచి  అవుట్ పుట్ ఇస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. దర్శకుడిగా మారుతి తన కెరియర్ ను చాలా చిన్న చిన్న సినిమాల తో మొదలుపెట్టాడు. మొదట్లో యూత్ కి నచ్చే కంటెంట్ ను మాత్రమే రెడీ చేసుకుంటూ వచ్చిన మారుతి, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తన సినిమాలకి వచ్చేలా చేసుకున్నాడు. అలాగే స్టార్ హీరోలు కూడా తనతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపించే రేంజ్ కి చేరుకున్నాడు.

మారుతి ఇంతవరకూ చేసిన సినిమాల్లో రెండు విశేషమైన ఆదరణ పొందాయి. ఒకటి ‘భలే భలే మగాడివోయ్’ అయితే .. రెండో సినిమా ‘మహానుభావుడు’. ఈ రెండు సినిమాలు చూస్తే మారుతి సినిమాల్లో కంటెంట్ ఎంత పెర్ఫెక్ట్ గా ఉంటుంది .. ఆయన సినిమాల్లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అనేది అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్ ను రాబడుతున్నాయి. ఈ రెండు సినిమాల నిర్మాతలతో కలిసి ఈ సారి ఆయన ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందించాడు. మొన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గోపీచంద్ –  రాశి ఖన్నా జంటగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తన సినిమాల్లో బలంగా చెప్పుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఈ సినిమాలో ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అలాగే గోపీచంద్ .. రావు  రమేశ్ .. సత్యరాజ్ పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. గోపీచంద్ మార్క్ యాక్షన్ ను కొంతవరకూ వర్కౌట్  చేశాడుగానీ, తన మార్క్ కామెడీ విషయంలోనే తక్కువ మార్కులను తెచ్చుకున్నాడు. మున్ముందు చిరంజీవి – ప్రభాస్ లతో మారుతి సినిమాలు చేయనున్నాడనే సంగతి తెలిసిందే. అందువలన ఆయన ఆ సినిమాల కథాకథనాలపై .. పాత్రలను తీర్చిదిద్దే విషయంపై .. సంభాషణలపై గట్టిగానే కసరత్తు చేయవలసి ఉంటుందనే మాట బలంగానే వినిపిస్తోంది మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్