Friday, November 22, 2024
HomeTrending Newsకామారెడ్డిలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ

కామారెడ్డిలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి మున్సిపాల్టి అభివృద్ధి 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. బాన్సువాడ మున్సిపాల్టీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయితీకి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. 10-15 రోజులలో మరోసారి జిల్లాకు వస్తాను. నిజాంసాగర్ ప్రాజెక్టు దగ్గర జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం నిర్వహిస్తామన్నారు.

అంతకుముందు కామారెడ్డిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయం  ప్రారంభించిన  ముఖ్యమంత్రి కేసీఆర్. పాల్గొన్న శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , రాష్ట్ర రోడ్లు& భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మొహమ్మద్ మహమ్మద్ అలీ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డిజీపీ మహేందర్ రెడ్డి, జహీరాబాద్ MP బిబీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ధఫేదార్ శోభ రాజు, డిసీసీబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. ఎ. శరత్, SP శ్వేతా రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్