Sunday, January 19, 2025
HomeTrending Newsభారత మెడికల్ హబ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత

భారత మెడికల్ హబ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత

Medical Hub : క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ఏఐజీ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దప్రేగు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సేంద్రీయ ఆహారం, సరైన వ్యాయామం… క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయని కవిత పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధితో ‌మరణించే వారి‌ సంఖ్య పెరుగుతోందని,నిరంతరం వైద్య పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత వ్యాయం చేస్తే వ్యాధులు రాకుండా వీలైనంతగా నియంత్రించవచ్చని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక సారైనా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యంగా మహిళలు,కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు,తమ ఆరోగ్యం పట్ల సైతం శ్రద్ధ వహించాలన్నారు.

హైదరాబాద్ ను భారతదేశ మెడికల్ హబ్ గా అభివర్ణించిన ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకుందన్నారు. అనేక దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా వైద్య రంగంలో విశేష సేవలందించిన డా. నాగేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

Also Read : సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులకు నిధులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్