Tuesday, September 24, 2024
HomeTrending Newsమల్టీ స్పెషాలిటీ కోర్సులు పెంచుతాం -హరీష్ రావు

మల్టీ స్పెషాలిటీ కోర్సులు పెంచుతాం -హరీష్ రావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఫలితంగా వైద్య విద్య, వైద్య సేవలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య సేవలలో గణనీయంగా అభివృద్ధిని సాధించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది యంగ్ మెడికల్ కాలేజ్ అన్నారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో మొదటి పీజీ బ్యాచ్ (2022-23) పిజీ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో ఈ రోజు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఉస్మానియా లాంటి కాలేజీలకే సంవత్సరానికి మూడు లేదా నాలుగు పీజీ సీట్లు వస్తాయని, కానీ మొదటి సంవత్సరంలోనే సిద్దిపేట మెడికల్ కాలేజ్ కు రికార్డ్ స్థాయిలో 57 పీజీ సీట్లు సాధించామని మంత్రి తెలిపారు.

మంత్రి హరీశ్ రావు కామెంట్లు:

తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు తెలంగాణ ప్రాంతంలో 2950 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండగా. తెలంగాణ సాధించిన ఈ ఏదేండ్ల కాలంలో 6715 సీట్లుగా పెంచుకున్నాము. ఇది 127% పెరుగుదల. 1180 పిజీ సీట్లు ఉండగా ఇప్పుడు 2501 గా సాధించుకున్నాము. రాష్ట్రం ఏర్పాడే నాటికీ 5 మెడికల్ కాలేజ్ ఉండగా ఈ ఒక్క సంవత్సరమే 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకొని ప్రస్తుతం 17 ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాము. వచ్చే సంవత్సరం మరో 9 కాలేజీలను ప్రారంభిస్తాము. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాము. భారతదేశంలో జాతీయస్థాయిలో ఎంబిబిఎస్ సీట్లు 54352 నుండి 93000 పెంపుతో జాతీయ సగటు 71 శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఏడు ఏళ్ల కాలంలో 2950 నుండి 6715 ఎంబిబిఎస్ సీట్ల పెంపుతో 127% సాధించాము. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల పెంపులో జాతీయస్థాయిలో 25416 పీజీ సీట్ల నుండి 42717 సీట్ల పెరుగుదలతో 68 శాతం పెరుగుదల ఉండగా తెలంగాణా రాష్ట్రంలో 1180 నుంచి 2501 సీట్లను పెంచుకొని 112 % సాధించాము.

భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మల్టీ స్పెషాలిటీ కోర్సుల సీట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి వెల్లడించారు. మెడికల్ కాలేజీలలో ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీల కొరత ఉంది. గుర్తుతెలియని వ్యక్తుల డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలలో ఉపయోగించరాదని చట్టంలో చెప్తున్నందున దాని పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో సంప్రదిస్తున్నాము. బీబీనగర్ లో గల ఎయిమ్స్ లో లేని వసతులు సిద్దిపేట ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఉన్నాయి. అక్కడ కనీసం పేషెంట్లకు బ్లడ్ బ్యాంకు లేదు. లేబర్ రూమ్ లేదు. అక్కడి స్టూడెంట్స్ విజ్ఞప్తి మేరకు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి ప్రాక్టికల్స్ కు మరియు వైద్య సేవలకు అనువదించడం జరిగింది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు 500 నుండి 600 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. త్వరలోనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథలాగ్, కీమోథెరపీ, రేడియో థెరపీ సేవలను ప్రారంభించనున్నాము. అన్ని రంగాలలో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్న మాదిరిగానే వైద్య విద్యలో కూడా జాతీయస్థాయిలో రోల్ మోడల్ గా నిలపాలి. కాలేజీలో ర్యాగింగ్ చేయకుండా జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్