Friday, March 13, 2026
HomeTrending NewsMedico Suicide:మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య

Medico Suicide:మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఎం.సనత్ (21) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఆత్మహత్య చేసుకున్న సనత్ పెద్దపల్లి జిల్లాకు చెందిన వాడిగా తెలిసింది. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఫైనల్ పరీక్షలు పూర్తిచేసి ప్రాక్టికల్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

జనవరి మాసంలో అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular