Tuesday, March 10, 2026
Homeసినిమా'గుంటూరు కారం'లో కలపని మీనాక్షి గ్లామర్!

‘గుంటూరు కారం’లో కలపని మీనాక్షి గ్లామర్!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి పరిచయమైన కథానాయికలలో మీనాక్షి చౌదరి ఒకరు. టాలీవుడ్ లో ఆమె కుదురుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆరంభంలో కెరియర్ గ్రాఫ్ కాస్త వీక్ గా కనిపించినప్పటికీ, ఆ తరువాత కాస్త స్పీడ్ గానే పుంజుకుంది. ‘ఖిలాడీ’ .. ‘హిట్’ సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సరైన హిట్ పడితే ఆమెకి అవకాశాలు పెరగడానికి ఎక్కువ సమయం పట్టదనే టాక్  వినిపించింది.  ఈ నేపథ్యంలోనే ఆమె ‘గుంటూరు కారం’లో చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

‘గుంటూరు కారం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసి ఉంటుందని చాలామంది భావించారు. చాలా తక్కువ సమయంలోనే మహేశ్ వంటి స్టార్ హీరో జోడీగా … త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లో మంచి ఛాన్స్ కొట్టేసిందని అనుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. పరిస్థితుల కారణంగా కుటుంబానికి దూరమైన తల్లిని ఆమె కొడుకు ఎలా ఇంటికి తిరిగి తీసుకొచ్చాడనేదే కథ.

ఈ సినిమాలో హీరోకి మరదలి పాత్రను మీనాక్షి చౌదరి పోషించింది. గతంలో కంటే ఈ సినిమాలో ఆమె మరింత అందంగా కనిపించింది. బావామరళ్ల మధ్య సరసాలు .. సందళ్లు ఉంటాయనీ, మీనాక్షి వైపు నుంచి హీరోతో ఒక పాట ఉండొచ్చని ప్రేక్షకులు భావించారు. కానీ అలాంటివేం జరగలేదు. ఒకటి రెండు సీన్లలో కనిపించడం .. ఒకటి రెండు డైలాగులు చెప్పడం తప్ప, కథలో ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత .. ప్రయోజనం లేకుండా పోయింది. కనుక ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ చేయలేకపోయిందనే చెప్పుకోవలసి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular