Sunday, January 19, 2025
HomeTrending NewsAmith Shah-Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కు ఈ భేటీ దోహదం: పవన్

Amith Shah-Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కు ఈ భేటీ దోహదం: పవన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్ణయాత్మక, నిర్మాణాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షా తో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పవన్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్  లు భేటీ అయ్యారు.   అమిత్ షా తో భేటీ సంతృప్తికరంగా జరిగిందని పవన్ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారని, రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన  ప్రణాళికలపై కూడా చర్చ జరిగిందని ఆ పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్