Tuesday, March 10, 2026
Homeసినిమా'భోళాశంకర్' కోసమే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!   

‘భోళాశంకర్’ కోసమే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!   

చిరంజీవి – మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందిన ‘భోళాశంకర్’, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, చిరంజీవి సరసన నాయికగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, అభిమానుల్లో మరింతగా ఆత్రుత పెరుగుతూ వెళుతోంది.

చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. వాళ్లు కోరుకున్న విధంగానే ఈ సినిమాలో ఆయన సందడి చేయనున్నాడని అంటున్నారు. మెహర్ రమేశ్ ఆ స్థాయిలోనే ఆయనను చూపించాడని చెబుతున్నారు. ఇక తమన్నా గ్లామర్ .. కీర్తి సురేశ్ సిస్టర్ సెంటిమెంట్ ఆడియన్స్ ను కూర్చోబెట్టే అంశాలుగా చెప్పుకోవచ్చు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని అంటున్నారు.

ఇది 2015లో అజిత్ హీరోగా చేసిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్. అక్కడ లక్ష్మీ మీనన్ .. శ్రుతి హాసన్ ప్రధానమైన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఆ సినిమా అక్కడ పెద్ద హిట్. అయితే తెలుగు ప్రేక్షకులు చాలామంది ఆ సినిమా చూశారు ..  ఆ కథ ఏమిటనేది కూడా తెలుసు. అందువలన ఇక్కడికి  వచ్చేసరికి ఇది మెగాస్టార్ మేజిక్ పైనే ఎక్కువగా ఆధారపడి నడవాల్సి ఉంటుంది. అలాంటి మేజిక్ చేయడం మెగాస్టార్ కి కొత్త కాకపోయినా, ఈ సినిమాకి అది ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular