Saturday, January 18, 2025
HomeTrending Newsవిశాఖలో జాబ్ మేళా ప్రారంభం

విశాఖలో జాబ్ మేళా ప్రారంభం

Job Mela-2:  వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్నమెగా జాబ్ మేళాలో భాగంగా రెండవ కార్యక్రమం విశాఖపట్నం లో నేడు ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఈ జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సీఎం జగన్ ఆశయం, ఆదేశాల మేరకు సామాజిక బాధ్యతగా వైఎస్సార్ సీపీ ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోందని విజయసాయి తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ఈ జాబ్ మేళాలో ఉద్యోగాల కోసం 70 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని, 201 ప్రముఖ కంపెనీలు 23,935 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయని వివరించారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు ఇది సువర్ణ అవకాశమని అభివర్ణించారు.

Also Read : మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు: విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్