Sunday, January 19, 2025
HomeTrending NewsVarun Tej - Lavanya Tripathi Engagement వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్...

Varun Tej – Lavanya Tripathi Engagement వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్?

మెగా హీరో వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ.. గతంలో వార్తలొచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ఆ ఇద్దరూ వాటిపై స్పందించలేదు. తాజాగా మరోసారి వీరిద్దరి గురించి మరో న్యూస్ వైరస్ అవుతోంది. అదే వారి ఎంగేజ్మెంట్, పెళ్లి. జూన్ మొదటి వారంలోనే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. అది నిజమేనంటూ సోషల్ మీడియాలో పలువురు చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన జరగనుందని విశ్వసనీయ సమాచారం. కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం ఉంటుందని తెలిసింది.పెళ్లి ఎప్పుడనే విషయం ఇంకా తేలలేదు. తాము మంచి స్నేహితులమని వరుణ్ తేజ్, లావణ్య లోగడే స్పష్టం చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. 1వ తేదీ రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారని సమాచారం. అనంతరం వీరి నిశ్చితార్థంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాను రోమ్ లో ఉన్నట్టు వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేశాడు. తాను ప్రయాణంలో ఉన్నట్టు లావణ్య కూడా ప్రకటించింది. దీంతో నెటిజన్లు వీరిద్దరూ కలిసే ప్రయాణిస్తున్నట్టు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలసి కొన్ని సినిమాల్లో నటించగా, 2017 నుంచి సన్నిహిత బంధం కొనసాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్