Saturday, January 18, 2025
Homeసినిమాసెన్సార్ పూర్తి చేసుకున్న'గాండీవ‌ధారి అర్జున'

సెన్సార్ పూర్తి చేసుకున్న’గాండీవ‌ధారి అర్జున’

వ‌రుణ్ తేజ్ న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాను తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో గూజ్ బంప్స్ తెప్పించే యాక్ష‌న్ స‌న్నివేశాలను చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ట్రైల‌ర్, సాంగ్ రిలీజ్ త‌ర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి.

తాజాగా ‘గాండీవ‌ధారి అర్జున’ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. 2 గంట‌ల 18 నిమిషాలుగా మేక‌ర్స్ ఈ సినిమా ర‌న్‌టైమ్‌ను లాక్ చేశారు. సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆక‌ట్టుకునే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో పాటు సినిమాలోని మంచి మెసేజ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

నాజ‌ర్‌, విమ‌లా రామ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌టీన‌టులు న‌ట‌న‌, సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ ప్రేక్ష‌కుల‌కు ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్