Friday, March 13, 2026
Homeసినిమా#Mega157: మరోసారి సొషియో ఫాంటసీ మూవీలో చిరు

#Mega157: మరోసారి సొషియో ఫాంటసీ మూవీలో చిరు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్రం  ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.  మరోసారి ఇలాంటి  ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరు  చూడాలని ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఇది నిజంగా గుడ్ న్యూస్. చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేశారు. ‘బింబిసార’ తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట దీనికి  దర్శకత్వం వహిస్తున్నారు. సక్సెస్ ఫుల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మించనున్నారు.’#మెగా157′ చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుండబోతోంది.

చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు అఫీషియల్ గా ఈ సినిమాను  అనౌన్స్ చేశారు.  విజువల్ గా కట్టిపడేస్తున్నఅనౌన్స్ మెంట్ పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం  (పంచభూతాలు ) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. ఈ అద్భుతమైన పోస్టర్ మెగా మాస్ యూనివర్స్ కు సాక్ష్యంగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular