చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కథానాయికగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలు పాత్రను కీర్తి సురేష్ నటిస్తుంది. ఆగష్టు 11న భోళా శంకర్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
చిరు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మల్లిడి వశిష్ట్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. ఇటీవల వశిష్ట్ సోషియో ఫాంటసీ నేపధ్యంలో చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. గతంలో యముడికి మొగుడు, అంజి సినిమాలు చేశారు. ఇందులో యముడుకి మొగుడు బ్లాక్ బస్టర్ అవ్వగా, అంజి ప్లాప్ అయ్యింది. ఈ సినిమా చాలా సంవత్సరాలు నిర్మాణంలో ఉండడం కారణంగా ఆలస్యంగా రిలీజ్ కావడంతో అప్పట్లో జనాల్ని ఆకట్టుకోలేకపోయింది.
సోషియో పాంటసీ మూవీని ఇంట్రస్టింగ్ గాను, ఎంటర్ టైనింగ్ గాను ఎలా చెప్పాలో బింబిసార సినిమాలో చూపించాడు. దీంతో తను చెప్పిన స్టోరీలో కూడా ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా చెప్పడం నచ్చడంతో ఓకే చెప్పారట. భోళా శంకర్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అనేది అధికారికంగా ప్రకటించలేదు కానీ.. దాదాపుగా వశిష్ట్ తో సినిమా చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం వశిష్ట్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరి.. త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.