Saturday, January 18, 2025
Homeసినిమామ‌రో రీమేక్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ?

మ‌రో రీమేక్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాద‌ర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇది మళయాళ సినిమా లూసిఫర్ కు  రీమేక్. దీని తర్వాత రానున్న  భోళా శంక‌ర్ కూడా రీమేక్ మూవీనే. ఇలా  చిరు ఎక్కువగా రీమేక్ మూవీస్ చేస్తుండడంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే… ఇప్పుడు మెగా స్టార్ మరో  రీమేక్ కి ఓకే చెప్పార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ ఈసారి ఏ మూవీని రీమేక్ చేయ‌నున్నారంటే… మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం భీష్మ పర్వం …. ఈ మూవీ రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నారట‌. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ఎవ‌రికి ఇవ్వ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

సంక్రాంతికి చిరంజీవి న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఉగాదికి భోళా శంక‌ర్ మూవీ రిలీజ్ చేయ‌నున్నారు. వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ రిలీజ్ త‌ర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేయ‌నున్నారని స‌మాచారం. అయితే… ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న మాత్రం త్వ‌ర‌లో వ‌స్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి… చిరు చేయ‌నున్న భీష్మ‌ప‌ర్వంను రీమేక్ చేసే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్