Mega Direction: మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాలు చేసిన అనుభవం. ఈ అనుభవంతో సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్ పై మంచి పట్టు ఉంది. అయితే.. ఇప్పుడు ఈ అనుభవంతో దర్శకత్వం చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే చెప్పారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఇందులో భాగంగానే చిరంజీవి దర్శకత్వం వైపు ఎప్పుడు వెళ్ళబోతున్నారు ? అనే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలియచేశారు.
చిరంజీవి మాట్లాడుతూ “ఇన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. కాబట్టి ఏ శాఖ పనితనం ఏంటి ? కెమెరా, మ్యూజిక్, ఆర్ట్ వంటి విషయాల పై పూర్తి అవగాహన ఉన్న నాకు దర్శకత్వం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. మంచి కంటెంట్ ఉంటే దర్శకత్వం చాలా ఈజీ. ఆ కంటెంట్ ను చక్కగా వండితే, వడ్డించడం ఎవరైనా చేస్తారు. అంటే నా ఉద్దేశంలో లెన్సులు మార్చి, ట్రాలీలు వేయడం, డ్రోన్లతో తీయడం వంటివి కాదు. దర్శకత్వం అంటే.. కథ, కథనం, కథా గమనం”
“నాకు డైరెక్షన్ చేయాలని ఆశగా ఉంది కానీ.. వరుసగా సినిమాలు చేస్తుండడం వలన బిజీగా ఉన్నాను. కానీ 70 ఏళ్ళు వచ్చాక డైరెక్టర్ గా మీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తాను” అంటూ యంగ్ డైరెక్టర్స్ తో చెప్పడం విశేషం. మరి… చిర డైరెక్టర్ గా ఎవరితో సినిమా చేస్తారో..? ఏ తరహా చిత్రం చేస్తారో చూడాలి.
Also Read : మరో ఐదు కథలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?