Saturday, January 18, 2025
Homeసినిమా'భోళా శంకర్' నిర్మాతలతో మెగాస్టార్.. వీఐ ఆనంద్ కి ఛాన్స్?

‘భోళా శంకర్’ నిర్మాతలతో మెగాస్టార్.. వీఐ ఆనంద్ కి ఛాన్స్?

చిరంజీవి తాజా ప్రాజెక్టుగా ‘విశ్వంభర’ సినిమా సెట్స్ పై ఉంది. శ్రీవశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెగాస్టార్ తో సినిమా చేయడానికి చాలామంది యువ దర్శకులు లైన్లో ఉన్నారు. ఆ జాబితాలో తాజాగా ఇప్పుడు వీఐ ఆనంద్ పేరు వినిపిస్తోంది. వీఐ ఆనంద్ ఎంచుకునే కథలు వైవిధ్యభరితంగా ఉంటాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ నుంచి రేపు విడుదల కానున్న ‘ఊరు పేరు భైరవకోన’ వరకూ ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంటాయి.

అలాంటి వీఐ ఆనంద్ .. చిరంజీవితో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆనంద్ తాజా చిత్రమైన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకి అనిల్ సుంకర నిర్మాత. ఆయన ఆనంద్ దగ్గరున్న మరో కథను విని అది చిరంజీవితో చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన చేశారట. అనిల్ సుంకరికి చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆ కథను చిరంజీవి వరకూ తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ బ్యానర్లో చిరంజీవి ఇంతకుముందు చేసిన ‘భోళా శంకర్’ సినిమా పరాజయాన్ని చవిచూసింది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా, నిర్మాతలకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అందువలన అనిల్ సుంకరకి చిరంజీవి మరో సినిమా చేసిపెట్టే ఇచ్చే ఛాన్స్ ఉంది. అందువలన కథ నచ్చితే చిరంజీవి ఈ ప్రాజెక్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ మారుతి – హరీశ్ శంకర్ లైన్లో ఉన్నారు గనుక, కథ ఓకే అయినా ఆనంద్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయమే పట్టొచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్