Saturday, January 18, 2025
Homeసినిమాచిరు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా?

చిరు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా?

Mega Meet: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య ‘ఏమాత్రం ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో ఇక నుంచి చేసే సినిమాల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఓకే చేసిన ప్రాజెక్ట్స్ ని కూడా ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఆచార్య ఎఫెక్ట్ తో సినిమాల షూటింగ్స్ విష‌యంలోనే కాకుండా ఏ సినిమా ముందు రిలీజ్ చేయాలి అనే విష‌యంలో కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట చిరంజీవి. విదేశాల నుంచి వ‌చ్చిన చిరంజీవి మ‌ళ్లీ షూటింగ్స్ లో బిజీ కానున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నార‌ట‌. గ‌తంలో ఎప్ప‌టి నుంచో చిరు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియ‌ల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు మాత్రం త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో సినిమా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యార‌ట‌. చిరులోని కామెడీ యాంగిల్‌ని ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తూ, అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

నిజానికి చిరు,త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్టవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చిరు నటించిన ‘జై చిరంజీవ’ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. ఈ మూవీలో చిరు వేసిన పంచ్ లైన్స్ అండ్ కామెడీ సీన్స్ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ఈ నేపథ్యంలో చిరుతో త్రివిక్రమ్ ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ చేస్తే ఎలా ఉంటుందో ఇక‌ చెప్పనవసరం లేదు. అయితే.. త్రివిక్ర‌మ్.. మ‌హేష్ తో మూవీ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత చిరంజీవితో సినిమా చేస్తారేమో చూడాలి.

Also Read : మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు ఎక్క‌డో తెలుసా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్