Friday, July 5, 2024
Homeసినిమా'విశ్వంభర' మెగాసందడి చేసేది అప్పుడే!

‘విశ్వంభర’ మెగాసందడి చేసేది అప్పుడే!

చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా రూపొందుతోంది. ఫాంటసీ టచ్ తో నడిచే సినిమా ఇది. చాలా కాలం తరువాత ఈ జోనర్లో చిరంజీవి చేస్తున్న సినిమా ఇది. అందువలన అందరూ కూడా ఈ సినిమా పట్ల చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఆల్రెడీ గ్రాఫిక్స్ తో ముడిపడిన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేశారు. మిగతా షూటింగు పూర్తయ్యేలోగా గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో అభిమానులు క్లారిటీని కోరుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. వచ్చే సంక్రాంతి పండగకి .. అంటే జనవరి 10వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రోజునో .. రేపో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అభిమానులంతా ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నారు.

‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా శ్రీవశిష్ఠ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే కథానాయకుడిని రెండు వేరు వేరు కాలాల్లో ఒకేసారి చూపిస్తూ .. సాధారణ ప్రేక్షకులకు సైతం అర్థమయ్యేలా ఆయన స్క్రీన్ ప్లే చేసుకోగలిగాడు. ఆ సినిమా చూసిన తరువాత అతనిపై నమ్మకంతోనే మెగాస్టార్ ఈ ఛాన్స్ ఇచ్చారు. దాంతో తనపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అతను కృషి చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా మెగా సందడి చేయనుందన్న మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్