Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ ముఖ్య అతిథిగా ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్

మెగాస్టార్ ముఖ్య అతిథిగా ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్

Mega Event: యాక్ష‌న్ హీరో గోపీచంద్, యూత్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టించింది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ నిర్మాత బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పక్కా కమర్షియల్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా జరగనుంది. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాశారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేశారు. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మ‌రి.. ఈ మూవీతో గోపీచంద్ ఆశించిన విజ‌యం సాధిస్తారో లేదో చూడాలి.

Also Read : జూన్ 12న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ ట్రైలర్ ఈవెంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్