Wednesday, March 18, 2026
Homeసినిమాసుమన్ ని అభినందించిన మెగాస్టార్

సుమన్ ని అభినందించిన మెగాస్టార్

సుమన్ నీచల్ కులమ్ అనే తమిళ చిత్రంతో నటుడు అయ్యారు. ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘నేటి భారతం’, ‘సితార’, ‘బావ బావమరిది’ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. 1990లో ప్రేక్షకులను అలరించి హీరోగా రాణించారు. ఇప్పటి సుమన్ వరకు ఎన్నో ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, ఆంగ్లం.. ఇలా పది భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నాగార్జున అన్నమయ్య సినిమాలో సుమన్ వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో అవార్డులు అందుకుని ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

అయితే.. సుమన్ నటుడుగా కెరీర్ ప్రారంభించి 45 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా చిరంజీవి తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే.. నటుడిగా ఎన్నో పాత్రల్లో నటించి పలు భాషల్లో ఆడియన్స్  క్రేజ్, అభిమానాన్ని సంపాదించుకున్న సుమన్ రాబోయే రోజుల్లో మనల్ని అందరినీ మరింతగా అలరించాలి. అలానే ఫిబ్రవరి 16న బెంగళూరులో సుమన్ 45 ఏళ్ళ ప్రస్థానం ఈవెంట్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. సుమన్ గురించి చిరంజీవి విడుదల చేసిన వీడియో బైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular