Saturday, January 18, 2025
Homeసినిమాపాస్ పోర్ట్ ఆఫీసర్ గా మెగాస్టార్..?

పాస్ పోర్ట్ ఆఫీసర్ గా మెగాస్టార్..?

చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే.. ఈ సినిమాలో చిరంజీవి పాస్ పోర్ట్ ఆఫీసర్ గా నటించనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఇది సినిమా పై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

ఇప్పటి వరకు చిరంజీవి పాస్ట్ పోర్ట్ ఆఫీసర్ గా నటించలేదు. ఫస్ట్ టైమ్ ఈ తరహా క్యారెక్టర్ చేస్తున్నారు. దీంతో అసలు కథ ఏమై ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరో క్యారెక్టర్ ఉందని.. ఆ పాత్రను సిద్దు జొన్నలగడ్డతో చేయించాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత సిద్దు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని కూడా టాక్ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సిద్దు ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడట. కాకపోతే బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదట.

అందుకనే సిద్దు డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే ఆ పాత్రను మరో యంగ్ హీరోతో చేయించాలి అనుకుంటున్నారట. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రం మలయాళ సినిమా బ్రో డాడీ సినిమాకి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. అలాంటిది ఏమీ లేదని.. ఇది స్ట్రైయిట్ మూవీ అని సమాచారం. ఈ చిత్రానికి కథను బెజవాడ ప్రసన్న అందించాడని తెలిసింది. ఇందులో చిరుకు జంటగా త్రిష కన్ ఫర్మ్ అయ్యింది. అలాగే సిద్దుకు జంటగా శ్రీలీలను ఎంచుకున్నారు. అయితే.. సిద్దు ఇందులో నటిస్తాడా..? లేదా..? అనేది క్లారిటీ రావాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్